Chandrababu: దత్తాత్రేయ, తమిళిసైలకు చంద్రబాబు ఫోన్.. శుభాకాంక్షలు

  • హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయ
  • తెలంగాణ బాధ్యతలు తమిళిసైకి అప్పగింత
  • పదవుల్లో రాణించాలని చంద్రబాబు ఆకాంక్ష 
రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులైన బండారు దత్తాత్రేయ, తమిళిసై సౌందరరాజన్ లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, తమిళిసై సౌందర్ రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, చంద్రబాబు వారిరువురికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఫోన్ ద్వారా తెలిపారు.
Chandrababu
Dattatreya
Tamizhisai

More Telugu News