Jagan: తన నియోజకవర్గంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం

  • పులివెందుల వెళ్లిన ఏపీ సీఎం
  • పీఏడీఏ అధికారులతో సమావేశం
  • సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశాలు
  • సీఎం జగన్ ను కలిసిన యూసీఐఎల్ సీఎండీ

తన సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తన తండ్రి దివంగత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఇవాళ ఇడుపులపాయ విచ్చేసిన జగన్, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత పులివెందులలో అధికారులతో సమావేశమయ్యారు. పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (పీఏడీఏ) అధికారులను అడిగి అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు.

అంతేకాకుండా, తుమ్మలపల్లి యూరేనియం శుద్ధి కర్మాగారం కాలుష్యంపైనా స్పందించారు. తనను కలిసిన యూసీఐఎల్ సీఎండీ సీకే హస్నావితో మాట్లాడారు. యూసీఐఎల్ కాలుష్యంపై పీసీబీ కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో హస్నావితో కాలుష్యం గురించి చర్చించారు.

  • Loading...

More Telugu News