Andhra Pradesh: పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'స్పెషల్ సాంగ్’ విడుదల చేసిన జనసేన పార్టీ!

  • నేడు జనసేనాని పుట్టినరోజు
  • అడుగొక్కటి వెనుకపడితే అంటూ సాగుతున్న పాట
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన జనసేన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా పవన్ పుట్టినరోజు నేపథ్యంలో జనసేన పార్టీ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ‘అడుగొక్కటి వెనుకపడితే నీ చరిత్ర ముగుస్తుందా. నీ ఆశయ సిద్ధాంతపు సెగ మంటను దహిస్తుందా. నీ పుట్టుక జాతి కొరకు. నీ మనుగడ నీతి కొరకు. భరతమాత ముద్దుబిడ్డ.. నీ పయనం ప్రజల కొరకు’ అంటూ సాగుతున్న పాట అదరగొట్టేస్తోంది. ఈ వీడియో గీతాన్ని మీరూ చూసేయండి.
Andhra Pradesh
Telangana
Jana Sena
Pawan Kalyan
birthday
Special song

More Telugu News