ITR: రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నుల దాఖలు!

  • శనివారం ఒక్క రోజే 49 లక్షల రిటర్నుల దాఖలు
  • గతేడాదితో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి
  • మొత్తం మీద చూస్తే 5.65 కోట్ల రిటర్నులు

ఆదాయపన్ను దాఖలుకు చివరి రోజైన శనివారం రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. ఆఖరి రోజున ఏకంగా 49 లక్షల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా, మొత్తం మీద చూస్తే 5.65 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి.  

ఆదివారం ఆదాయపు పన్ను శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018-19లో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో 4 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 5.4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి. గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసే రిటర్న్స్ ‌కు ప్రభుత్వం భారీగా ఫీజు వసూలు చేస్తుండడంతో ఈసారి చాలామంది గడువులోగానే రిటర్నులు దాఖలు చేయడంతో ఈ వృద్ధి నమోదైంది.

మొత్తం 5.65 కోట్ల  మంది పన్ను రిటర్న్న్ దాఖలు చేయగా అందులో 25 శాతం గత ఐదు రోజుల్లోనే దాఖలు కావడం గమనార్హం. శనివారం అత్యధికంగా ప్రతీ సెకనుకు 196 ఐటీఆర్ (ఐటీ రిటర్న్స్) దాఖలు కాగా, నిమిషానికి 7,447 ఐటీఆర్‌లు దాఖలు కావడం విశేషం.

More Telugu News