Sri Lanka: టీ20ల్లో లసిత్ మలింగ సరికొత్త రికార్డు.. అఫ్రిది రికార్డు బద్దలు

  • టీ20ల్లో 99 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు
  • న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో ఘనత
  • 2011లో టెస్టుల నుంచి తప్పుకున్న లసిత్
శ్రీలంక పేసర్ లసిత్ మలింగ టీ20ల్లో ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించాడు. 99 వికెట్లతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీసిన మలింగ ఖాతాలో 99 వికెట్లు చేరాయి. ఫలితంగా 98 వికెట్లతో పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది పేరిట ఇప్పటి వరకు ఉన్న అత్యధిక వికెట్ల రికార్డు బద్దలైంది. 36 ఏళ్ల మలింగ 74వ టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. కాగా, 2011లో టెస్టుల నుంచి తప్పుకున్న మలింగ జులైలో వన్డేలో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడాడు.
Sri Lanka
shahid afridi
t20
Lasith Malinga

More Telugu News