cobra: దుకాణాల వద్ద నాగుపాముతో తాగుబోతు హల్‌చల్.. భయపెట్టి డబ్బులు వసూలు చేసిన వైనం!

  • అనకాపల్లిలో తాగుబోతు వీరంగం
  • భయంతో పరుగులు తీసిన మహిళలు
  • పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి పంపించిన యువకులు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఓ తాగుబోతు నాగుపాముతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. జోరు వానను సైతం లెక్క చేయక ప్రజలు వినాయక చవితి సామగ్రి కోసం రాజా థియేటర్ సమీపంలో దుకాణాలకు వచ్చారు. కొనుగోళ్లతో ఆ ప్రాంతం రద్దీగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఓ తాగుబోతు నాగుపామును పట్టుకుని దుకాణదారులు, జనాన్ని భయపెట్టాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వని వారిని పామును చూపించి బెదిరించాడు. దీంతో జనం హడలిపోయి ఉన్నది సమర్పించుకుని పరుగులు తీశారు. మహిళలైతే భయంతో వణికిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దీనిని గమనించిన కొందరు యువకులు తాగుబోతును పట్టుకుని అక్కడి నుంచి బలవంతంగా పంపించారు.

More Telugu News