Nirmala Sitharaman: బ్యాంకులు విలీనం చేస్తోంది ఉద్యోగుల సంఖ్య తగ్గించడానికి కాదు: నిర్మలా సీతారామన్

  • త్వరలో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం
  • ఉద్యోగుల సంఖ్య తగ్గించడానికేనంటూ ప్రచారం
  • వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్

దేశంలో ఇప్పటికి 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, త్వరలో విలీనాలు జరగనున్న నేపథ్యంలో వాటి సంఖ్య 12కి తగ్గనుంది. అయితే, బ్యాంకుల విలీనంతో భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం అవుతున్నంత మాత్రాన ఉద్యోగులను తొలగిస్తామని భావించడం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.

తాను మీడియా సమావేశంలో చెప్పింది బ్యాంకుల విలీనం గురించి మాత్రమేనని, ఉద్యోగుల సంఖ్య తగ్గింపుపై ఎక్కడా మాట్లాడలేదని వివరించారు. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోవడంలేదని, అది జరగని పని అని వెల్లడించారు. ఆరోపణలు చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఈ విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

More Telugu News