Sasitharoor: పాక్ జర్నలిస్టుతో శశిథరూర్ గడిపింది నిజమే... సునంద కేసులో కీలక సాక్ష్యమిచ్చిన నళినీ సింగ్!

  • దుబాయ్ లో మూడు రాత్రులు గడిపారు
  • సునందే స్వయంగా చెప్పి ఏడ్చింది
  • కోర్టుకు నళినీ సింగ్ వాంగ్మూలం

సునందా పుష్కర్‌ మృతి కేసులో ప్రధాన నిందితుడైన శశి థరూర్‌ కు వ్యతిరేకంగా గట్టి సాక్ష్యం లభించింది. పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్టు మెహర్‌ తార్డ్‌ తో శశి థరూర్‌ దుబాయ్‌ లో మూడు రాత్రులు గడిపారని సునంద స్నేహితురాలు నళినీ సింగ్‌ కోర్టుకు వెల్లడించారు. ఆమె వాంగ్మూలాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ, న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ ముందు చదివి వినిపించారు.

సునంద తనకు మూడు సంవత్సరాలుగా తెలుసునని, చనిపోవడానికి ఏడాది ముందు నుంచే తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని నళినీ సింగ్ వెల్లడించారు. దుబాయ్‌ లో మెహర్‌ తో తన భర్త గడిపి వచ్చారని ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. వారి మధ్య శృంగార సందేశాలు కూడా నడిచాయని చెప్పిన ఆమె ఏడ్చిందని వెల్లడించారు. కాగా, సునంద ఆత్మహత్య కేసులో థరూర్‌ ను ప్రాసిక్యూట్‌ చేయాలంటూ, ఢిల్లీ పోలీసులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

More Telugu News