IRCTC: ఐఆర్సీటీసీలో రైల్ టికెట్ బుక్ చేస్తే మరింత బాదుడు!

  • మూడేళ్ల క్రితం రద్దయిన సర్వీస్ చార్జ్
  • డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు నిర్ణయం
  • తిరిగి వసూలు చేయనున్న ఐఆర్సీటీసీ

నేటి నుంచి ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా రైల్ టికెట్ బుక్ చేస్తే, మరింత బాదుడు తప్పదు. ఈ –టికెట్లపై నేటి నుంచి సర్వీస్‌ చార్జీలను వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. నాన్‌ ఏసీ టికెట్లపై రూ.15, అన్ని ఏసీ తరగతులపై రూ. 30 అదనంగా వసూలు చేయనున్నామని, ఈ సర్వీస్‌ చార్జీకి జీఎస్టీ అదనమని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ప్రజలను డిజిటల్‌ చెల్లింపులవైపు మళ్లించి, టికెట్ల అమ్మకాలను పెంచేందుకు మూడు సంవత్సరాల క్రితం ఈ సర్వీస్ చార్జీని ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో నాన్‌ ఏసీకైతే రూ.20, ఏసీకైతే రూ.40 చొప్పున సర్వీస్‌ చార్జ్ ఉండేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News