Peddireddy: నాడు ఇసుక ద్వారా వేల కోట్లు దోచుకున్నవాళ్లే ఇప్పుడు మాపై రాళ్లేస్తున్నారు: పెద్దిరెడ్డి

  • ఇసుక తవ్వకాలపై గత ప్రభుత్వాన్ని ఎన్జీటీ తప్పుపట్టింది 
  • మేం పారదర్శక విధానాన్ని తీసుకువస్తున్నాం 
  • సెప్టెంబరు 5 నుంచి వచ్చే ఇసుక విధానాన్ని ప్రజలు హర్షిస్తారన్న మంత్రి

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక అంశంపై వ్యాఖ్యలు చేశారు. ఇసుక ద్వారా గత ప్రభుత్వంలోని వారు వేల కోట్లు దోచుకున్నారంటూ మండిపడ్డారు. నాడు ఇసుకపై దోచుకున్నవాళ్లే నేడు తమ ప్రభుత్వంపై రాళ్లు విసురుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇసుక తవ్వకాలపై గత ప్రభుత్వాన్ని ఎన్ జీటీ కూడా తప్పుపట్టిందని అన్నారు. తాము పారదర్శక విధానాన్ని తీసుకువస్తున్నామని, ఇసుక తవ్వకాలను నియంత్రించామే తప్ప అర్హులకు ఇసుక సరఫరా నిలిపివేయలేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాలు అడ్డుకున్న అధికారులను టీడీపీలా అవమానించలేదని పేర్కొన్నారు. సెప్టెంబరు 5 నుంచి తాము తీసుకువస్తున్న ఇసుక విధానంపై ప్రజలు తప్పకుండా హర్షిస్తారని తెలిపారు.

More Telugu News