KCR: గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్.. ఈటల అంశం సమసిపోయింది: ఎర్రబెల్లి

  • గులాబీ జెండాను తయారు చేసింది కేసీఆరే
  • ఈటల పదవికి ఎలాంటి ఢోకా లేదు
  • తెలంగాణ ఉద్యమానికి నేను కూడా సహకరించా
గులాబీ జెండాకు తామే బాసులమని మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ తో ఆయన సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో, ఈటల వ్యాఖ్యలపై మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని చెప్పారు. గులాబీ జెండాను తయారు చేసింది కేసీఆరే అని అన్నారు. ఈటల రాజేందర్ ది ముగిసిపోయిన అంశమని... ఆయన పదవికి కూడా ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి తాను కూడా సహకరించానని తెలిపారు. ఈరోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రబెల్లి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
KCR
KTR
Etala
Errabelli
TRS

More Telugu News