Chiranjeevi: 'సైరా' గురించి ఆ వార్తలో నిజం లేదట

  • వివిధ భాషల్లో విడుదల కానున్న 'సైరా'
  • అదే రోజున హిందీలో వస్తోన్న 'వార్'
  • అక్టోబర్ 2వ తేదీనే రానున్న 'సైరా'

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, చిరంజీవి సరసన నాయికగా నయనతార నటించింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే హిందీలో 'వార్' సినిమా అదే రోజున భారీ స్థాయిలో విడుదలవుతోంది. అందువలన 'సైరా' విడుదల అక్టోబర్ 8వ తేదీకి వెళ్లొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ప్రధానంగా తెలుగు మార్కెట్ నే టార్గెట్ చేసుకున్నందు వలన, ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీనే విడుదల చేయనున్నట్టుగా పీఆర్ టీమ్ చెబుతూ, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

More Telugu News