పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన... పార్టీకి ప్రాణమిచ్చే వారిని కుక్కలతో పోల్చాడంటూ విజయసాయిపై బుద్ధా ఫైర్
- టీడీపీ అధినాయకత్వంపై విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్
- ఘాటుగా బదులిచ్చిన బుద్ధా వెంకన్న
- నీలాంటి అవినీతి పందులకు జైలు పూజ చేయిస్తామంటూ వ్యాఖ్యలు
"అయినా పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన? దొంగలెక్కలు రాసేవాడికి కార్యకర్తలు, నాయకుల విలువ ఎలా తెలుస్తుంది? పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేవారిని కుక్కలతో పోల్చి సంబరపడిపోతున్నావు, నీలాంటి అవినీతి పందులకు త్వరలోనే జైలు పూజ చేయిస్తాం. త్వరలోనే నీకు చిప్పకూడు ఖాయం" అంటూ తీవ్ర ఆవేశంతో బుద్ధా ట్వీట్ చేశారు.
"మిమ్మల్ని చూసినా, మీ మాటలు విన్నా పత్తిత్తే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు రాజకీయ హింస మొదలుపెడితే ఈ రోజు పిచ్చికూతలు కూయడానికి మీరు ఉండేవారు కాదేమో!" అంటూ ఈటెల్లాంటి మాటలతో బుద్ధా బదులిచ్చారు.