prabhas: అమెరికాలో నిరాశపరిచిన సాహో.. వసూళ్లలో ఆరోస్థానం!

  • ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన సాహో
  • ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సినిమా
  • అమెరికా ప్రీమియర్‌లో 915 వేల డాలర్ల వసూళ్లు

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సాహో సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ప్రేక్షకులను ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మరోవైపు, అమెరికాలోనూ సాహో నిరాశపరిచింది. ప్రీమియర్‌లో  9,15,224 డాలర్లు వసూళ్లు రాబట్టడంతో బయ్యర్లు షాక్ అయ్యారు. ఇక వసూళ్ల పరంగా చూస్తే అమెరికాలో సాహో ఆరో స్థానంలో నిలిచింది.

మహేశ్ బాబు నటించిన ‘స్పైడర్’ వంటి భారీ డిజాస్టర్ కూడా అమెరికా ప్రీమియర్‌లో 1.00 మిలియన్ డాలర్లు రాబట్టగా, పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్ డాలర్లు సాధించింది. ‘ఖైదీ నంబర్‌ 150’ 1.29 మిలియన్‌ డాలర్లు వసూలు చేయగా, అత్యధికంగా ‘బాహుబలి 2’.. 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. సాహో మాత్రం 915 వేల డాలర్లతో ఆరో స్థానంలో నిలిచింది. ‘భరత్ అనే నేను’ (850), అరవింద సమేత (789), రంగస్థలం (725), సర్దార్ గబ్బర్ సింగ్ (616) వేల డాలర్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News