Saaho: 'సాహో'కు షాక్.. ఆన్ లైన్ లో సినిమా లీక్

  • నేడు విడుదలైన ప్రభాస్ 'సాహో' చిత్రం
  • గంటల వ్యవధిలోనే లీక్ చేసిన తమిళ్ రాకర్స్
  • డౌన్ లోడ్ కు సిద్ధంగా ఉందని వెల్లడించిన Bollywoodlife.com

దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఈరోజు విడుదలైంది. మరోవైపు, సాహో టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ చిత్రం ఆన్ లైన్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్ ఈ చిత్రాన్ని లీక్ చేసింది. హైక్వాలిటీ ఉన్న 'సాహో' చిత్రం ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని Bollywoodlife.com వెబ్ సైట్ వెల్లడించింది.

తమిళ్ రాకర్స్ ఓ చిత్రాన్ని లీక్ చేయడం ఇదే తొలిసారి కాదు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, రజనీకాంత్ తదితర సూపర్ స్టార్లంతా ఈ వెబ్ సైట్ బారిన పడినవారే. బాలీవుడ్ మూవీలను సైతం ఈ వెబ్ సైట్ లీక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

  • Loading...

More Telugu News