Team India: దక్షిణాఫ్రికాతో మూడు టీ20లకు భారత జట్టు ప్రకటన.. ధోనీకి మొండిచేయి.. హార్దిక్ పాండ్యా ఇన్!

  • ఈ నెల 15 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
  • అనుకున్నట్టే ధోనీకి లభించని చోటు
  • భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతి
వచ్చే నెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు ఖరారైంది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది. ముందుగా అనుకున్నట్టే ధోనీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించారు. ప్రపంచకప్ తర్వాత విశ్రాంత్రి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యాకు తిరిగి జట్టులో చోటు లభించింది. పేసర్లు భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతి  ఇచ్చారు. ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైనీలు జట్టులో చోటు దక్కించుకున్నారు.

సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే..

విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్ పాండే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైనీ.
Team India
south africa
t20
MS Dhoni
hardik pandya

More Telugu News