jamuna: అప్పటి సినిమాలు చూస్తూ నా అందాన్ని నేనే పొగుడుకుంటూ వుంటాను: సీనియర్ హీరోయిన్ జమున

  • మంచి సినిమాలు చేయడం నా అదృష్టం 
  • నేను చేసిన సినిమాల్లోని పాటలు చూస్తాను 
  • ఆ పాటలు నాకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి 

అలనాటి అందాల తారగా జమున అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. హరనాథ్ .. జగ్గయ్య వంటి స్టార్ హీరోలతో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. అలాంటి జమున తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నాకు ఏ మాత్రం తీరిక దొరికినా, గతంలో నేను చేసిన సినిమాల్లోని పాటలను చూసుకుంటాను. నేను చేసిన సినిమాల్లోని పాటలను రెండు పెన్ డ్రైవ్ లలో వేసుకున్నాను. ప్రతిరోజు ఆ పాటలను ప్లే చేసుకుని చూస్తుంటాను.

ఆయా పాటలు .. ఆ పాటల్లో నా లుక్స్ .. హావభావాలను పలికించిన తీరును చూసుకుంటాను. 'జమున ఎంత గొప్పగా చేశావ్ .. ఎంత అందంగా వున్నావ్ .. ఎంత అదృష్టవంతురాలివే' అంటూ నా అందాన్ని నేనే పొగుడుకుంటూ వుంటాను. అలా అలనాటి నా సినిమాల్లోని పాటలను చూసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది .. ఉత్సాహాన్ని ఇస్తుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News