Andhra Pradesh: ఏపీలో పాలన కుక్కలు చింపిన విస్తరిగా మారింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన గోరంట్ల
  • ఏపీలో రద్దుల పరంపర కొనసాగుతోంది
  • నవరత్నాలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు

ఏపీలో రద్దుల పరంపర కొనసాగుతోందని, పాలన కుక్కలు చింపిన విస్తరిగా మారిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాలు పేరుతో ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.

మరో టీడీపీ నేత చినరాజప్ప మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, అన్ని రంగాల కార్మికులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News