Pakistan: విజయవంతంగా క్షిపణి పరీక్షను నిర్వహించిన పాకిస్థాన్.. వీడియో చూడండి

  • 290 కి.మీ. పరిధి గల ఘజ్నవీ ప్రయోగం విజయవంతం
  • వివిధ రకాల వార్ హెడ్లను మోసుకుపోగల సామర్థ్యం దీని సొంతం
  • బలూచిస్థాన్ లోని టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి ప్రయోగం

న్యూక్లియర్ క్షిపణి పరీక్షను పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. 290 కిలోమీటర్ల పరిధి కలిగి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఘజ్నవీ బాలిస్టిక్స్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించామని పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. ఈ సందర్భంగా పాక్ మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఘజ్నవీ నైట్ ట్రైనింగ్ లాంచ్ ను విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. వివిధ రకాలైన వార్ హెడ్స్ ను ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరం వరకు మోసుకుపోగలదని చెప్పారు. తాము సాధించిన విజయానికి పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు.

మరోవైపు, కరాచీ ఎయిర్ స్పేస్ లోని మూడు రూట్లను ఈనెల 31 వరకు మూసి వేస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిన్న ప్రకటించింది. దీంతో, బలూచిస్థాన్ లోని టెస్ట్ రేంజ్ నుంచి పాకిస్థాన్ క్షిపణి పరీక్షను నిర్వహించబోతోందనే వార్తలు వెనువెంటనే వెలువడ్డాయి. మరోవైపు, జమ్మూకశ్మీర్ అంశంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించడంతో... ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News