Srikakulam District: కూన రవికుమార్‌పై కక్ష సాధింపునకు దిగితే చూస్తూ ఊరుకోం: అచ్చెన్నాయుడు

  • ఆయన ఇంటికి పోలీసులను పంపాల్సిన అవసరం ఏమొచ్చింది
  • జిల్లా ఎస్పీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి
  • కార్యాలయాల్లో వైసీపీ నేతల అనధికార పెత్తనం పెరిగింది
ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌పై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగితే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూన రవికుమార్‌ ఇంటికి వచ్చి పోలీసులు ఎందుకు తనిఖీలు చేశారని ప్రశ్నించారు.

జిల్లా ఎస్పీ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని అడుగులు వేయాలని, లేదంటే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ నాయకుల అనధికార పెత్తనం ఎక్కువయ్యిందని, అధికారుల కుర్చీల్లో వారెలా కూర్చుంటారని మండిపడ్డారు. కూన రవికుమార్‌కు టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Srikakulam District
kunaravikumar
acchennaidu

More Telugu News