Andhra Pradesh: ఏపీలో నేడు విద్యాసంస్థల బంద్!

  • బంద్ కు పిలుపునిచ్చిన పలు విద్యార్థి సంఘాలు
  • పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
ఏపీలో నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశాయి. పెండింగ్ లో ఉన్న రూ. 1,112 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి.

బంద్ కు పీడీఎస్యూ, పీడీఎస్వో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, తదితర విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా... తాజాగా టీఎన్ఎస్ఎఫ్ కూడా తన సంఘీభావాన్ని ప్రకటించింది. బంద్ పై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
Andhra Pradesh
Educatinal Institutions
Bandh

More Telugu News