Jammu And Kashmir: ఆంక్షల ఎఫెక్ట్‌...పస్తులతో కాలం గడుపుతున్న కశ్మీర్‌లోని ట్యాక్సీ డ్రైవర్లు

  • ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణం 
  • మూడు వారాలకుపైగా బాడుగలేక కుదేలు
  • ఆశతో స్టాండ్‌కు వచ్చినా బేరానికి పిలిచిన వారు కరవు

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆంక్షల వల్ల ట్యాక్సీ, ఆటో డ్రైవర్ల బతుకులు కుదేలయ్యాయి. అద్దెకు బండి కట్టించుకునే వారు లేక పస్తులతో జీవించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతిరోజూ ఎంతో ఆశతో ట్యాక్సీ స్టాండ్‌కు వస్తున్నా అద్దెకు పిలిచేవారుగాని, బండి ఎక్కేవారు గాని లేకపోవడంతో సాయంత్రం వరకు నిరాశతో ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని ట్యాక్సీ, ఆటో వాలాలు వాపోతున్నారు.

పూట గడిచే పరిస్థితి కూడా లేకపోవడంతో దేవుడిపైనే భారం వేసి నెట్టుకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాహనాలు కొనుగోలు చేశామని,  పూటగడవడానికే ఆపసోపాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ బకాయిలు ఎలా చెల్లించాలో దిక్కుతోచడం లేదని తెలిపారు. పరిస్థితుల్లో ఎప్పటికి మార్పు వస్తుందో, ఎప్పటికి తమ జీవితాలు కుదుటపడతాయో అర్థం కావడం లేదని బాధను వ్యక్తం చేశారు.  

More Telugu News