saaho movie: సాహో సినిమా బ్యానర్ కడుతుండగా అపశ్రుతి.. అభిమానికి విద్యుదాఘాతం

  • మహబూబ్‌నగర్‌లోని తిరుమల థియేటర్ వద్ద ఘటన
  • కరెంట్ షాక్‌తో రెండో అంతస్తు నుంచి కిందపడిన యువకుడు
  • హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
మహబూబ్‌నగర్‌లో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలను పురస్కరించుకుని స్థానిక థియేటర్‌లో బ్యానర్ కడుతుండగా ఓ అభిమాని కరెంట్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. స్థానిక తిరుమల థియేటర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

ప్రభాస్ అభిమాని అయిన బోయపల్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు థియేటర్ ఆవరణలో ఫ్లెక్సీ కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. థియేటర్ రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. కాళ్లు విరిగిపోయి విలవిల్లాడాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. థియేటర్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
saaho movie
Tollywood
mahaboobnagar
poster

More Telugu News