World Badminton: పీవీ సింధును అభినందించిన చంద్రబాబు

  • సింధుకు ఫోన్ చేసిన చంద్రబాబు
  • దేశం గర్వించదగ్గ తెలుగుబిడ్డ సింధు
  • ఆమె మరిన్ని విజయాలు సాధించాలి: చంద్రబాబు
ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధుకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ లో విజయం సాధించి, జగజ్జేతగా నిలిచిన సింధుకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా సింధు తల్లిదండ్రులను, కోచ్ పుల్లెల గోపీ చంద్ ను కూడా బాబు అభినందించారు. దేశం గర్వించదగ్గ తెలుగుబిడ్డ సింధు అని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధును స్ఫూర్తిగా తీసుకుని వర్ధమాన క్రీడాకారులు కూడా రాణించాలని సూచించారు.
World Badminton
PV Sindhu
Telugudesam
Chandrababu

More Telugu News