Mopidevi Venkata Ramana: అర్హత కలిగినవారికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు: ఏపీ మంత్రి మోపిదేవి

  • సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరడానికే వలంటీర్ వ్యవస్థ 
  • రికమెండేషన్లు, పైరవీలకు నో చాన్స్ అంటూ స్పష్టీకరణ
  • దళారుల మాటలు నమ్మవద్దంటూ హెచ్చరిక
సంక్షేమ పథకాలు ప్రతి లబ్దిదారుడికి అందాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలు జరుపుతోందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అర్హత కలిగిన వారికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు లభిస్తాయని, సిఫారసులు, పైరవీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Mopidevi Venkata Ramana
Andhra Pradesh
YSRCP

More Telugu News