Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలు!: వైసీపీ నేత రవిచంద్రారెడ్డి ఆరోపణ

  • రాజధాని ప్రాంతంలో ఆయనకు 3 వేల ఎకరాలకు పైగా భూములు 
  • దీనిపై చర్చకు టీడీపీ సిద్ధమా?
  • చర్చిద్దామంటే నేను ఎక్కడికైనా వస్తాను
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ గతంలో మూడు వేలకు పైగా ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ భూముల విలువ దాదాపు పది వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆరోపించారు. ఈ విషయమై చర్చించేందుకు తాను ఎక్కడికైనా వస్తానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దీనిపై చర్చకు టీడీపీ సిద్ధమా? అని ప్రశ్నించారు. బినామీ ఆస్తుల పరిరక్షకుడిగా నారాయణ పని చేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపైనా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చాలా నేరమని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది ఎవరో కాదని చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. ఒక సీఎంగా ప్రజలకు సేవ చేయకుండా, ఒక మెగా రియల్టర్ అవతారమెత్తిన బాబు, తనకు కావాల్సిన వాళ్లకు దోచిపెట్టారని నిప్పులు చెరిగారు.
Andhra Pradesh
Amaravathi
Narayana
YSRCP
Ravi chandra Reddy
cm
Jagan
Chandrababu

More Telugu News