Jammu And Kashmir: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్ యువతకు 50,000 ఉద్యోగాలు

  • కశ్మీర్ యువత కోసం కేంద్రం తాజా నిర్ణయం
  • జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ఇది భారీ నియామకం అని పేర్కొన్న గవర్నర్
  • త్వరలోనే కశ్మీర్ పై కేంద్రం నుంచి కీలక ప్రకటన ఉంటుందన్న సత్యపాల్ మాలిక్
జమ్మూకశ్మీర్ యువతను తీవ్రవాదం వైపు నుంచి దూరంగా తీసుకువచ్చేందుకు కేంద్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపు చేయాలని నిర్ణయించింది. వచ్చే మూడు నెలల్లో 50,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ నియామక ప్రక్రియగా భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేయనుందని గవర్నర్ పేర్కొన్నారు. అయితే అదేంటన్నది మాత్రం చెప్పలేదు. జమ్మూకశ్మీర్ ఉనికి, సంస్కృతికి సంబంధించిన ప్రతి అంశం పరిరక్షిస్తామని తెలిపారు. ఇక, కశ్మీర్ లో మొబైల్ సేవల నిషేధానికి కారణం, సంఘ విద్రోహ శక్తులకు ఇంటర్నెట్ ప్రధాన సాధనం కావడమేనని అన్నారు.
Jammu And Kashmir
Jobs
Governer
Satyapal Malik

More Telugu News