Andhra Pradesh: వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించాలి: టీడీపీ నేత దేవినేని డిమాండ్

  • వరదల కారణంగా రూ.4 వేల కోట్ల నష్టం జరిగింది
  • ప్రభుత్వం మాత్రం రూ.95 కోట్లు అని చెబుతోంది
  • రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదు

ఏపీలో కృష్ణా నదికి ఇటీవల సంభవించిన వరదల కారణంగా ప్రజల ఇళ్లు, పంట పొలాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ముంపు బాధితులను, రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి తగిన నష్టపరిహారం చెల్లించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ స్పందిస్తూ, వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, రూ.4 వేల కోట్ల నష్టం జరిగితే రూ.95 కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయారని మండిపడ్డారు.

More Telugu News