FDI: తయారీ రంగం హబ్ గా భారత్ ను తీర్చిదిద్దుతున్నాం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

  • గతంలో విదేశీ మారక నిల్వలు పడిపోయాయి
  • మోదీ హయాంలో వాటి నిల్వలు 280 మిలియన్ డాలర్లకు చేరాయి
  • ఎఫ్డీఐల ఆకర్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది

తయారీ రంగం హబ్ గా భారత్ ను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కేంద్ర కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు ప్రకాశ్ జవదేవకర్, పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, గతంలో విదేశీ మారక నిల్వలు సున్న స్థాయికి పడిపోయాయని, మోదీ హయాంలో వాటి నిల్వలు 280 మిలియన్ డాలర్లకు చేరాయని అన్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, ఎఫ్డీఐ నిబంధనలు సరళీకరించి పెట్టుబడులను పెంచామని చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని అన్నారు. ప్రింట్ మీడియాలోని 26 శాతం ఎఫ్ డీఐల అనుమతి డిజిటల్ మీడియాకు వర్తిస్తుందని, బొగ్గు గనుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు అనుమతించాలని తదితర నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.

More Telugu News