central Minister: దేశంలో 75 కొత్త వైద్య కళాశాలలు నిర్మిస్తాం: కేంద్ర మంత్రి జవదేకర్

  • 2021-22 లోగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తాం
  • తద్వారా 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వస్తాయి
  • చెరకు రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాం

దేశంలో కొత్తగా డెబ్బై ఐదు వైద్యకళాశాలలను నిర్మిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కేంద్ర కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు ప్రకాశ్ జవదేవకర్, పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ, 2021-22 లోగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేస్తామని, తద్వారా 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకూ వైద్యకళాశాలలు లేని చోట్లలో వీటిని నిర్మిస్తామని అన్నారు. ఈ సందర్భంగా చెరకు రైతుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, రూ.6 వేల కోట్ల ఎగుమతి రాయితీ ఇస్తామని ప్రకటించారు. చెరకు రైతులను ఆదుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నామని, దీని వల్ల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఆ రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు.

More Telugu News