Harish Shankar: ఇంతకాలానికి నా కల నిజమైంది: దర్శకుడు హరీశ్ శంకర్

  • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
  • విభిన్నమైన కథాకథనాలే ప్రధాన బలం 
  • వచ్చేనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు
హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అధర్వ మురళి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. వచ్చేనెల 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇంకా ఈ సినిమా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటూనే వుంది. 'గోదావరి తీరంలో కాదు .. గోదావరి నదిలోనే షూటింగు జరుపుతున్నాము. గోదావరిలో షూటింగు చేయాలనే నా కల నిజమైంది' అనే ట్వీట్ తో పాటు, ఒక సెల్ఫీని కూడా హరీశ్ శంకర్ పోస్ట్ చేశాడు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఈ పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు.
Harish Shankar
Varun Tej

More Telugu News