Pakistan: సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం!: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • ఆర్టికల్ 370 రద్దు చేసిన భారత్
  • రగిలిపోతున్న పాక్
  • యుద్ధం గురించి మాట్లాడుతున్న పాక్ నేతలు

ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని భారత్, కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్.... ఎన్నో ఏళ్లుగా దాయాది దేశాలు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్న బాణీలివి. అయితే భారత్ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాకిస్థాన్ స్వరం మారింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి సాధారణ మంత్రుల వరకు యుద్ధ రాగాన్ని ఆలపిస్తున్నారు. తాజాగా, పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ యుద్ధంపై జోస్యం చెప్పారు. సెప్టెంబరులో కానీ, అక్టోబరులో కానీ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని, ఇదే చివరి యుద్ధం అని అన్నారు. కశ్మీర్ పై పోరాడేందుకు తమకు సరైన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందుకు రావడంలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News