Andhra Pradesh: రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలి: బీజేపీ నేత కన్నా

  • రాజధాని అమరావతి మార్పును వ్యతిరేకిస్తాం
  • ఇక్కడి నిర్మాణాలకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారు
  • బాధ్యత గల ప్రభుత్వం రాజధానిని మారుస్తుందని అనుకోను

రాజధాని అమరావతి మార్పును వ్యతిరేకిస్తామని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో నిర్మాణాలకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారని, బాధ్యత గల ప్రభుత్వం రాజధానిని మారుస్తుందని అనుకోనని అన్నారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని, ఆయన స్పష్టత నిచ్చాక తమ వైఖరి చెబుతామని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రాలేదని, 2014లో అన్ని రాజకీయపార్టీలు ఐక్యంగా ఉంటే హోదా వచ్చేదని, భద్రాచలం కూడా ఏపీలోనే ఉండేదని వ్యాఖ్యానించారు.

More Telugu News