Andhra Pradesh: ‘ఒక్క అవకాశం’ అంటూ అందలమెక్కి.. ఏపీని అంధకారంలోకి నెట్టారు: చంద్రబాబునాయుడు

  • అమరావతి కాన్సెప్ట్ నే చంపేసే పరిస్థితి నెలకొంది
  • ఇక్కడి వాళ్లు హైదరాబాద్ కు వలస పోతున్నారు
  • రైతుల త్యాగాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
‘ఒక్క అవకాశం’ ఇవ్వండంటూ ప్రజలను కోరిన  వైఎస్ జగన్, అందలమెక్కాక మూడు నెలల్లోనే  రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి కాన్సెప్ట్ నే చంపేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. అమరావతిని దెబ్బతీయడంతో, ఇక్కడి వాళ్లు హైదరాబాద్ కు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, వారి త్యాగాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. తన హయాంలో మిగులు విద్యుత్ ఇస్తే, ఇప్పటి ప్రభుత్వం మాత్రం విద్యుత్ కోతలు విధిస్తోందని దుయ్యబట్టారు. 
Andhra Pradesh
Amaravathi
Telugudesam
Chandrababu

More Telugu News