Prince: నేనెప్పుడూ డీలాపడిపోలేదు: హీరో ప్రిన్స్

  • తేజగారు తొలి ఛాన్స్ ఇచ్చారు 
  • మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను 
  • జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న ప్రిన్స్

తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకూ నాకూ డాష్ డాష్' చిత్రం ద్వారా ప్రిన్స్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమా ఆడిషన్స్ కోసం నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఇక్కడ తెలిసిన వాళ్లెవరూ లేకపోవడంతో, సినిమా ఆఫీసులోనే పడుకునేవాడిని. తేజ గారి సినిమాలో చేయడం వలన నాకు క్రమశిక్షణ తెలిసింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు హిట్ కావడంతో యూత్ లో క్రేజ్ పెరిగింది.

ఆ తరువాత వరుసగా సినిమాలు పరాజయంపాలు కావడం, అవకాశాలు తగ్గుతూ రావడం జరిగింది. ఒకటి రెండేళ్లు ఖాళీగా వుండిపోయిన సందర్భాలు వున్నాయి. అయినా ఇలా జరిగిందేంటబ్బా అనుకుంటూ నేను డీలాపడిపోలేదు. నాకు తెలియని విషయాలు తెలుసుకునేవాడిని. అలా గ్యాప్ వచ్చినప్పుడల్లా యాక్టింగ్ కోర్స్ చేశాను .. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను .. డాన్స్ నేర్చుకున్నాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయం నాకు తెలుసు గనుక, ఆశతో .. నమ్మకంతో ముందుకు వెళుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News