Ami Jackson: నా కడుపులో ఉన్నది అబ్బాయి: అమీ జాక్సన్

  • జార్జ్ పనయోట్టుతో అమీ డేటింగ్
  • గర్భవతి అయిన తరువాత నిశ్చితార్థం
  • బిడ్డ పుట్టిన తరువాత వివాహం
యూకేకు చెందిన బిజినెస్ మాగ్నెట్ జార్జ్ పనయోట్టుతో డేటింగ్ చేసి, గర్భవతి అయిన తరువాత అతనితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న హీరోయిన్‌ అమీ జాక్సన్‌ వచ్చే నెలలో తల్లికానుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ లేడీగా తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తన విశేషాలను పోస్ట్‌ చేస్తోంది. ఇక తనకు స్కానింగ్ జరుగుతున్న చిత్రాన్ని పోస్ట్ చేసిన అమీ, "బేబీ బాయ్‌ కి జన్మనివ్వబోతున్నాను" అని క్యాప్షన్ పెట్టింది. జార్జ్, అమీల నిశ్చితార్థం మేలో జరుగగా, వచ్చే నెలలో బిడ్డకు జన్మనివ్వనున్న అమీ, ఆ తరువాత పెళ్లి చేసుకోనున్నారు. వచ్చే సంవత్సరం గ్రీస్ లో 'బీచ్ సైడ్ వెడ్డింగ్'ని వీరిద్దరూ ప్లాన్ చేసినట్టు సమాచారం.
Ami Jackson
Baby Boy
Pregnent
Marriage
Dating

More Telugu News