amaravathi: అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే...కానీ రాజధాని ఉండాలి: సుజనా చౌదరి

  • బీజేపీ రైతులకు అండగా ఉంటుంది
  • కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఊహించలేదు
  • ఏపీ సమగ్ర అభివృద్ధి మా  పార్టీ కోరుకుంటోంది

అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదేకాని, అందుకోసం రాజధానిని మార్చాల్సిన అవసరం లేదని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి అన్నారు. రాజధాని విషయంలో కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఊహించలేదని, రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఏపీలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, అలా అని రాజధాని రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. ఒక పార్టీని చూసి రైతులు భూములు ఇవ్వలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారని, అటువంటి వారిని ఇప్పుడు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఇళ్లను కూడా రాజధానిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం ఇవ్వక పోవడం అన్యాయమన్నారు.

More Telugu News