Kajal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • భారీ తమిళ చిత్రంలో కాజల్ 
  • నితిన్ సినిమాకి మ్యూజిక్ కంపోజింగ్ 
  • 'బాహుబలి 3' గురించి ప్రభాస్

*  అందాలతార కాజల్ తమిళంలో ఓ భారీ చిత్రంలో నటించే ఛాన్స్ కనిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ పాత్రకు కాజల్ ను సంప్రదిస్తున్నారట.
*  నితిన్, కీర్తి సురేశ్ జంటగా 'రంగ్ దే' పేరిట ఓ రొమాంటిక్ చిత్రం రూపొందుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో మ్యూజిక్ కంపోజింగ్ మొదలయింది.
*  ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి' సీరీస్ లో మూడో భాగం కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో ప్రభాస్ వెల్లడించాడు. 'రాజమౌళి మూడో పార్ట్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఎప్పుడు మొదలుపెడతాడన్నది మాత్రం తెలియదు' అని చెప్పాడు ప్రభాస్.

More Telugu News