India: భారత వ్యతిరేక వీడియో పోస్టు చేసిన పాక్ దేశాధ్యక్షుడికి ట్విట్టర్ నోటీసులు

  • కశ్మీర్ నిరసనల ర్యాలీ వీడియో పోస్టు చేసిన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ
  • ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపిన ట్విట్టర్
  • ట్విట్టర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న భారతీయుల చలవే అని పాక్ ఆరోపణ

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి నోటీసులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ లో పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ ఆయన కొన్ని వీడియోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ముఖ్యంగా, కశ్మీర్ నిరసనలతో కూడిన ఓ ర్యాలీకి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఆ వీడియోలు భారతదేశ చట్టాల్ని ఉల్లంఘించేలా ఉన్నాయంటూ ట్విట్టర్ కఠినంగా స్పందించింది. ఈ మేరకు పాక్ దేశాధ్యక్షుడికి ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపింది.

దీనిపై పాక్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కశ్మీర్ కు అనుకూలంగా పోస్టులు పెడుతున్న వారి ఖాతాలను ట్విట్టర్ తొలగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయాల్లో ఎక్కువగా భారతీయులే పనిచేస్తున్నారని, వారే తమ ఖాతాలు తొలగిస్తున్నారంటూ పాక్ ప్రముఖులు ఆరోపిస్తున్నారు.

More Telugu News