Chidambaram: చిదంబరంకు షాక్.. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత
  • సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్య
  • కింద కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచన

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కింది కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే సీబీఐ కస్టడీలో చిదంబరం ఉన్నారని... ఇప్పుడు బెయిల్ పిటిషన్ ను విచారించడం అనవసరమని తెలిపింది.

ఢిల్లీ హైకోర్టు చిదంబరంకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన తరపున న్యాయవాదులైన కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్విలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు, ఈ రోజుతో చిదంబరంకు సీబీఐ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, కస్టడీని పొడిగించాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టును సీబీఐ అధికారులు కోరనున్నారు. చిదంబరం విచారణలో కీలక ఆధారాలు లభించాయని... దీంతో, మరింత లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని, కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నట్టు సమాచారం.

More Telugu News