కుమారస్వామి నన్నెప్పుడూ మిత్రుడిగా చూడలేదు: సిద్ధరామయ్య

  • మొదటి నుంచి శత్రువుగానే చూశారు
  • నాపై ఎప్పుడూ నమ్మకం ఉంచలేదు 
  • సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కుమారస్వామే కారణమని ఆరోపించారు. కుమారస్వామి తనను ఎన్నడూ మిత్రుడిగా భావించలేదని... తనను నమ్మలేదని చెప్పారు. తనను మొదటి నుంచి శత్రువుగానే చూశారని... రెండు పార్టీల మధ్య సమస్యలకు ఇదే కారణమని... చివరకు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీసిందని తెలిపారు.

సిద్ధరామయ్యపై మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలు గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని వారు వ్యాఖ్యానించారు. తమ కుటుంబంపై సిద్ధరామయ్య కక్ష కట్టారని దేవెగౌడ బహిరంగంగానే విమర్శించారు.

More Telugu News