Andhra Pradesh: ఏపీ గవర్నర్ భార్యకు అస్వస్థత... సన్ షైన్ ఆసుపత్రిలో ఆపరేషన్!

  • మోకాళ్ల నొప్పులతో అస్వస్థత
  • సికింద్రాబాద్ కు తీసుకువచ్చిన అధికారులు
  • నేడు ఆపరేషన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భార్య సుప్రవ హరిచందన్ మోకాళ్ల నొప్పులతో అస్వస్థతకు గురై, నిన్న సికింద్రాబాద్‌ లోని సన్‌ షైన్‌ ఆసుపత్రిలో చేరగా, ఆమెకు నేడు వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించనున్నారు. ఆమెకు కీళ్ల మార్పిడి ఆపరేషన్‌ చేయనున్నామని, హాస్పిటల్ ఎండీ, జాయింట్‌ రిప్లేస్‌ మెంట్‌ చీఫ్‌ డాక్టర్‌ గురవారెడ్డి ఆమెకు ఈ శస్త్రచికిత్స చేస్తారని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ అనంతరం ఆమె కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని అన్నారు.
Andhra Pradesh
Governer
Suprava Harichandan

More Telugu News