Atchannaidu: మైకుల్లో మాట్లాడడం తప్ప బొత్స ఏంచేయలేడు: అచ్చెన్నాయుడు

  • ఏపీ సర్కారుపై అచ్చెన్న ధ్వజం
  • వైసీపీకి ఆర్నెల్ల సమయం ఇస్తే ఏమీ మిగలదంటూ విమర్శ
  • తాము ఇంత తొందరంగా రోడ్డెక్కాల్సి వస్తుందనుకోలేదంటూ వ్యాఖ్యలు
ఏపీ సర్కారుపై టీడీపీ అగ్రనేత అచ్నెన్నాయుడు ధ్వజమెత్తారు. తాము ఇంత తొందరగా రోడ్డెక్కాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని విమర్శించారు. వైసీపీకి ఆర్నెల్ల సమయం ఇద్దామని మొదట అనుకున్నా, ఇప్పుడు ఆర్నెల్ల సమయం ఇస్తే ఏమీ మిగలదని అర్థమైందని వ్యాఖ్యానించారు.

బొత్స మైకుల్లో మాట్లాడడం తప్ప ఏమీ చేయలేడని, రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో పెట్టినప్పుడు అందరూ చప్పట్లు కొట్టినవారేనని అచ్చెన్న గుర్తుచేశారు. అంతేగాకుండా, సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరంపై జగన్ పంతానికి పోతున్నారని, కానీ పరిస్థితి పట్ల ఆయన అవగాహన చేసుకోవాలని హితవు పలికారు.
Atchannaidu
Botsa Satyanarayana
Jagan
Andhra Pradesh

More Telugu News