PV Sindhu: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ కైవసం

  • ఫైనల్లో ఒకుహరపై విజయం
  • ప్రత్యర్థిని వరుస గేముల్లో చిత్తుచేసిన సింధు
  • 38 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో గతంలో రెండు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గడంలో విఫలమైన తెలుగుతేజం పీవీ సింధు మూడో ప్రయత్నంలో విజయకేతనం ఎగురవేసింది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్  లో సింధు విజేతగా అవతరించింది.

ఇవాళ జరిగిన ఫైనల్లో జపాన్ అమ్మాయి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు 21-7, 21-7తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది.

More Telugu News