Apple: స్టీవ్ జాబ్స్ అసలు వద్దనుకున్న ఫీచర్... కొత్త ఐఫోన్ లో ప్రత్యక్షం!

  • స్టైలస్ ను వద్దనుకున్న స్టీవ్ జాబ్స్
  • ఆ ఆలోచనే తనకు లేదని వెల్లడి
  • యాపిల్ పెన్సిల్ తో రానున్న కొత్త ఫోన్

స్టీవ్ జాబ్స్... యాపిల్ ఫోన్ల సృష్టికర్త. యాపిల్ సంస్థను ఎంతో ఎత్తునకు తీసుకెళ్లిన ఆయన, ఆపై సంస్థను వీడి వెళ్లారు. కానీ, ఆయన ఏ మాత్రమూ ఇష్టపడని, యాపిల్ ఫోన్లలోకి చేర్చేందుకు అంగీకరించని ఓ ఫీచర్ ను ఇప్పుడు తాజా వర్షన్ లో యాపిల్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ,  "స్టైలస్ ను ఎవరు కోరుకుంటారు? ఛీ... అసలు ఆ ఆలోచనే నాకు లేదు. స్టైలస్ ను యాపిల్ ఫోన్లకు జోడించే ఉద్దేశం నాకు లేదు" అని పలుమార్లు వ్యాఖ్యానించారు.

ఇప్పుడిక, తాజా ఐ ఫోన్ కేస్ లను తయారు చేసే ఆర్డర్ యూకే కు చెందిన మొబైల్ ఉపకరణాల సంస్థ ఓలిక్సర్ కు రాగా, దీనిలో ఇన్ బిల్ట్ యాపిల్ పెన్సిల్ కోసం ఓ స్లాట్ ఉన్నట్టుగా సమాచారం. ఈ పెన్సిల్ స్టైలస్ గా పని చేస్తుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త వైరల్ కాగా, స్టీవ్ వద్దనుకున్న ఫీచర్ ను తిరిగి ఎలా ప్రవేశపెడతారని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

గతంలో విడుదలై ఫెయిలయిన యాపిల్ పెన్సిల్ కు ఇది సరికొత్త వర్షన్ అని సమాచారం. పాత పెన్సిల్ తో పోలిస్తే ఇది చిన్నగా ఉంటుందని, ప్రీమియమ్ లెదర్ తో తయారైనదని, సులువుగా వాడుకునేలా ఉంటుందని సమాచారం. కాగా, ఐఫోన్ 11వ వర్షన్ త్వరలో మార్కెట్లోకి రానున్న సంగతి తెలిసిందే. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది.

More Telugu News