Anantapur District: పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

  • అనంతపురం జిల్లాలోని ఫ్యాక్టరీలో ప్రమాదం
  • పేలిన బాయిలర్
  • ఆరుగురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాయిలర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసి గాయపడిన వారి తాలూకూ కుటుంబ సభ్యులు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  


Anantapur District
penna cement
Fire Accident

More Telugu News