America: కాల్పులతో ఉలిక్కిపడిన అమెరికా.. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన బాలికపై కాల్పులు

  • బాలిక మృతి.. మరో ముగ్గురికి గాయాలు
  • మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో ఘటన
  • ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ ఫుట్‌బాల్ కార్యక్రమానికి హాజరైన బాలికపై దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జరిగిందీ ఘటన. నగరంలో ఏప్రిల్ నుంచి జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సోల్డన్ హైస్కూలు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిందని పేర్కొన్న పోలీసులు, కాల్పుల్లో ఆమె కుటుంబ సభ్యులు గాయపడిందీ, లేనిదీ తెలియరాలేదన్నారు. కాల్పులకు గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
America
Gun fire
St. Louis

More Telugu News