Raviteja: ఈ ఫొటోలో ఉన్నది రవితేజే... కొత్త సినిమా కోసం డిఫరెంట్ లుక్!

  • డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న రవితేజ
  • కొత్త లుక్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న మాస్ హీరో
  • వైరల్ గా మారిన రవితేజ లేటెస్ట్ ఫొటో

హీరో రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే, రవితేజ పాత్రకు సంబంధించిన కొత్త గెటప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వ్యక్తితో రవితేజ సెల్ఫీ చూస్తే ఎంతో ఆశ్చర్యపోతారు. చూడగానే మాంచి యవ్వనంలో ఉన్న రవితేజలా కనిపిస్తాడు.

ఇప్పటివరకు దర్శనమిచ్చిన రవితేజ ఒకెత్తయితే ఈ కుర్ర రవితేజ మరో ఎత్తు అని చెప్పాలి. అంత యంగ్ గా కనిపిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న డిస్కో రాజా చిత్రం కోసం రవితేజ ఎంతో కష్టపడుతున్నాడనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ హీరోయిన్లు.

More Telugu News