Andhra Pradesh: తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జైట్లీ విలువలకు కట్టుబడ్డారు!: ఏపీ సీఎం జగన్

  • ఈరోజు మధ్యాహ్నం కన్నుమూసిన జైట్లీ
  • నివాళులు అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి
  • ఆయన కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ప్రార్థన
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైట్లీ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో జైట్లీ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
Arun Jaitly
dead
Twitter

More Telugu News