AP CM: తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం జగన్‌

  • అమెరికాలోని పలు ప్రాంతాల్లో వారంపాటు పర్యటన
  • అక్కడి తెలుగు ప్రజలతో సమావేశం
  • ఈ తెల్లవారు జామున హైదరాబాద్‌కు, అక్కడి నుంచి గన్నవరానికి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికాలోని పలుప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈనెల 15వ తేదీన జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెసిలిందే. అక్కడ పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలతోపాటు విదేశాంగ శాఖ అధికారులతోనూ సమావేశమయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్థన్‌ శింగ్లా వాషింగ్టన్‌ డీసీలో ఇచ్చిన విందులో పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్యవేత్తలనుద్దేశించి మాట్లాడారు. తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి తాడేపల్లికి  చేరుకున్నారు.
AP CM
america tour
tadepalli reached

More Telugu News